• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

CMRF చెక్కుల పంపిణి

NRPT: మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామానికి చెందిన అంజిలమ్మ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 38వేల రూపాయల చెక్కును సోమవారం జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి బాధితురాలికి పంపిణీ చేశారు. వీరన్న, హరీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 9, 2026 / 12:55 PM IST

GMPS జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి: రమేష్

JN: GMPS జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాదం రమేష్ పిలుపునిచ్చారు. తరిగొప్పుల గ్రామంలో సోమవారం GMPS మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. 42% రిజర్వేషన్ అమలు, గొర్రెల కాపరులకు రక్షణ చట్టం, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో GMPS నాయకులు తదితరులు ఉన్నారు.

March 9, 2026 / 12:54 PM IST

డిగ్రీ కళాశాలలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’

SDPT: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవరోజు జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ ల్యాబ్లను అధ్యాపకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, ల్యాబ్లను శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరావు, టి.ప్రభాకర్, కె. సుదర్శన్ పాల్గొని, ప్రయోగశాలల నిర్వహణపై విద్యార్థులకు సూచనలు చేశారు.

March 9, 2026 / 12:51 PM IST

‘పంట మార్పిడి విధానంతో అధిక ఆదాయం సాధ్యం’

BHPL: చిట్యాల మండలం కేంద్రంలోని రామచంద్రాపూర్, కైలాపూర్ గ్రామ శివారులో సోమవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ మాట్లాడారు. పంట మార్పిడి విధానంతో అధిక ఆదాయం సాధ్యమని తెలిపారు. డ్రిప్ సాగుతో నీటి పొదుపు, ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు.

March 9, 2026 / 12:47 PM IST

కుటుంబ సభ్యుల చెంతకు వృద్దురాలిని చేర్చిన పోలీసులు

ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ ప్రాంతానికి చెందిన బలుస కనుకమ్మ నిన్న అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రూరల్ SI సందీప్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు, సోమవారం బోరిగం గ్రామంలో ఆమెను గుర్తించి కుటుంబానికి అప్పగించారు. ఇంట్లోని వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని SI అన్నారు.

March 9, 2026 / 12:41 PM IST

కస్టోడియన్ సెంటర్లను సందర్శించిన డీఐఈవో

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లోని కస్టోడియన్ సెంటర్లను సందర్శించి ప్రశ్నాపత్రాలు సీఎస్, డీవోలకు పంపిణీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన మౌలిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

March 9, 2026 / 12:40 PM IST

ఎమ్మెల్యేను కలిసిన అంగన్వాడీలు టీచర్లు

అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను అంగన్వాడీ టీచర్లు కలిశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల డిమాండ్లను ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ. 26 వేలు, రిటైర్మెంట్ అయిన టీచర్లకు రూ. 2 లక్షలు వెంటనే చెల్లించాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

March 9, 2026 / 12:40 PM IST

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: శెట్టిపాలెంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల దశాబ్దాల సొంతింటి కల నిజమైందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు కూడా వారు శంకుస్థాపన చేశారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

March 9, 2026 / 12:35 PM IST

అవుసలికుంటలో ఉచిత టీబీ వైద్య శిబిరం

NGKL: లింగాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, డాక్టర్ జయచంద్ర ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అవుసలికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక టీబీ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పెద్దలు రంగినేని శ్రీనివాసరావు సూచనల మేరకు, సర్పంచ్ కోడావత్ మంగమ్మ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

March 9, 2026 / 12:35 PM IST

అంతంపల్లి నర్సరీని సందర్శించిన కలెక్టర్

KMR: భిక్కనూర్ మండలం అంతంపల్లి నర్సరీని సోమవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణ బాధ్య తను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎమ్మార్వో సునీత ఉన్నారు.

March 9, 2026 / 12:30 PM IST

చెత్తలో కనిపించని చిత్రాలు

GDWL: గద్వాల ఆసుపత్రి గోడలపై వేసిన మహానీయుల చిత్రాలు అధికారుల నిర్లక్ష్యంతో చెత్తలో కనిపించకుండా పోతున్నాయి. ప్రహరీ గోడ వెంట చెత్త, ముళ్లపొదలు పెరగడంతో చిత్రాలు ముసుగైపోయాయి. పరిసరాల్లో పారిశుద్ధ్యం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

March 9, 2026 / 12:30 PM IST

నివాళులు అర్పించిన మండలి ఛైర్మన్ గుత్తా

BHNG: చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేట్ గ్రామంలో మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి తండ్రి తాడూరి బుచ్చిరెడ్డి మృతి చెందగా.. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.

March 9, 2026 / 12:30 PM IST

వెల్గనూర్ విద్యార్థులకు బంగారు పతకాలు

MNCL: దండేపల్లి మండలంలోని వెలుగనూరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కరాటే పోటీలో బంగారు పతకాలు సాధించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్ ఫు కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాఠశాలకు చెందిన శృతి, సాయి ప్రణవి, అంజు శ్రీ, అనుదీప్తి, శ్రీ నిత్య, జాష్ణవి, శ్రీష్మ, అవంతిక ప్రథమ స్థానం సంపాదించి బంగారు పతకాలు అందుకున్నారు.

March 9, 2026 / 12:29 PM IST

‘ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి’

ADB: ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని DMHO నరేందర్ రాథోడ్ తో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నాటు వైద్యాన్ని దూరంగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.

March 9, 2026 / 12:27 PM IST

ప్రజలకు ఇచ్చిన హామీకి శాశ్వత పరిష్కారం

BDK: అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామపంచాయతీ పరిధిలో కొర్రివారిగుంపు నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ లైన్ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడెం ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

March 9, 2026 / 12:27 PM IST