వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లోని కస్టోడియన్ సెంటర్లను సందర్శించి ప్రశ్నాపత్రాలు సీఎస్, డీవోలకు పంపిణీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన మౌలిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు.