RR: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జన ఔషధి కేంద్రాలు విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ఓ పాఠశాలలో ‘జన ఔషధి దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ.. సామాన్యులకు తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను నడుపుతోందన్నారు.