• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేటితో ముగియనున్న నరసింహ స్వామి జాతర

WGL: గీసుకొండ మండల కేంద్రంలోని కొమ్మాల గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ ఊరేగింపును రాత్రి 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.

March 7, 2026 / 07:05 PM IST

రేవల్లి నూతన తహశీల్దార్‌గా ఎన్.సరస్వతి నియామకం

WNP: రేవల్లి మండలం తహశీల్దార్‌గా ఎన్.సరస్వతి నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన కేతావత్ లక్ష్మీదేవి వనపర్తి జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. దీంతో నూతన తహశీల్దార్ శనివారం రేవల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు.

March 7, 2026 / 07:05 PM IST

మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్

ADB: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష జండా ఊపి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. గెలుపొందిన విజేతలకు మహిళా దినోత్సవ సందర్భంగా బహుమతులు అందజేస్తామన్నారు.

March 7, 2026 / 07:03 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

SRD: మహిళలపై వేధింపులు ఆపాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు పాల్గొన్నారు.

March 7, 2026 / 07:03 PM IST

అలివేలు మంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు

MBNR: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన అలివేలు మంగమ్మ ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా మొత్తం రూ.10,09,442 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాస రాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

March 7, 2026 / 07:02 PM IST

కామారెడ్డి పోలీస్ ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్!

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయడంతో వరుస దొంగతనాలకు చెక్ పడటమే కాకుండా, అంతర్రాష్ట్ర ముఠాలు సైతం పట్టుబడుతున్నాయి. ఇటీవల రామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో జరిగిన మూడు వేర్వేరు దొంగతనాల కేసులను పకడ్భందీగా ఛేదించారు.

March 7, 2026 / 07:02 PM IST

నిరుపయోగంగా మారిన సంచార వైద్యశాల వాహనం

GDWL: జిల్లాలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల వాహనం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. అయిజ మండల పరిషత్ కార్యాలయ సమీపంలో వాహనం తుప్పుపట్టే స్థాయికి చేరుకుంది. నెటిజన్లు వాహనాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకు వెళ్లి గ్రామీణులకు వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

March 7, 2026 / 07:02 PM IST

సబ్ స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా

SDPT: కరెంట్ సమస్యపై గునుకుల కొండాపూర్ సబ్‌స్టేషన్ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కొండాపూర్, చీమలకుంటపల్లీ సర్పంచ్‌లు సొల్లు అజయ్ వర్మ, జంగిడి ప్రకాష్ పాల్గొన్నారు. రెండు రోజులుగా కరెంట్ లేక తాగునీరు, వ్యవసాయ పనులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అజయ్ వర్మ తెలిపారు. గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు ఎక్స్‌ప్రెస్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

March 7, 2026 / 07:02 PM IST

కుక్కల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

NZB: రుద్రూర్‌లో శనివారం కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో గుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్లే వారిపై దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలన్నారు.

March 7, 2026 / 07:02 PM IST

పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం

KNR: గన్నేరువరం మండలంలోని గుణుకులకొండాపూర్ గ్రామంలో శనివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో, పాఠశాల హెచ్ఎం, గ్రామపంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 7, 2026 / 07:01 PM IST

వన్యప్రాణులను వేటాడిన ముగ్గురిపై కేసు నమోదు

MNCL: వేమనపల్లి మండలం కేతనపల్లి శివారులోని కల్మల పేట అటవి సమీపంలో అటవీ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరెంట్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్య నేరమని గ్రామస్థులను హెచ్చరించారు. చుక్కల దుప్పిని వేటాడిన గ్రామానికి చెందిన రాజ్ కుమార్, శ్రీకాంత్, సంతోష్‌‌లపై శనివారం వన్యప్రాణి చట్టం కింద అటవీ శాఖ కేసు నమోదు చేసింది.

March 7, 2026 / 07:01 PM IST

చిట్యాల పీహెచ్సీలో ఉచిత వైద్య పరీక్షలు

NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు. చిట్యాల, వెలిమినేడు పీహెచ్సీల వైద్యులు ఈసం వెంకటేశ్వర్లు, సత్య నరేష్, నరసింహ, ఇతర వైద్య నిపుణులు సేవలందించారు.

March 7, 2026 / 07:00 PM IST

AICC మహిళా అధ్యక్షురాలిని కలిసిన PCC మహిళా అధ్యక్షురాలు

WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, రాబోవు రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేస్తానని తెలిపారు.

March 7, 2026 / 06:51 PM IST

‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి’

SRCL: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనీ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో గౌతమ్ మోడల్ స్కూల్లో 14వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, విలువలను అలవరుచుకోవాలన్నారు.

March 7, 2026 / 06:48 PM IST

‘ఐటిఐ లో శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’

PDPL: రామగుండం ప్రభుత్వ ఐటీఐలో యువతకు నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించుటకు 6 రకాల స్వల్ప కాలిక కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేందర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఆసక్తిగల నిరుద్యోగ యువత ఇట్టి శిక్షణ కోర్సులను వినియోగించుకోవాలని కోరారు.

March 7, 2026 / 06:45 PM IST