WNP: రేవల్లి మండలం తహశీల్దార్గా ఎన్.సరస్వతి నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన కేతావత్ లక్ష్మీదేవి వనపర్తి జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. దీంతో నూతన తహశీల్దార్ శనివారం రేవల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు.