MNCL: వేమనపల్లి మండలం కేతనపల్లి శివారులోని కల్మల పేట అటవి సమీపంలో అటవీ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరెంట్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్య నేరమని గ్రామస్థులను హెచ్చరించారు. చుక్కల దుప్పిని వేటాడిన గ్రామానికి చెందిన రాజ్ కుమార్, శ్రీకాంత్, సంతోష్‌లపై శనివారం వన్యప్రాణి చట్టం కింద అటవీ శాఖ కేసు నమోదు చేసింది.