• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘చెట్ల కొమ్మలు తొలగించాలి’

ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లు ప్రమాదానికి పొంచి దర్శనమిస్తున్నాయి. రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్తు స్థంబాల తీగలకు చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగి అంటుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

March 7, 2026 / 08:33 PM IST

ఫ్యానుకు ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

NLG: నార్కట్‌పల్లి మండలం మాదవడవల్లి లో సామ తనుష్ రెడ్డి (19) అనే విద్యార్థి శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుని తండ్రి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 7, 2026 / 08:32 PM IST

తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం

ASF: గ్రామాల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని గొప్పగా చెప్పుకుంటూ నిర్మించిన యోగ సాధన కేంద్రం వాంకిడిలో మాత్రం తాళాలకే పరిమితమైంది. స్థానిక వాంకిడి మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య స్వస్థత కేంద్రం’ పేరుతో ఏర్పాటు చేసిన యోగ కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.

March 7, 2026 / 08:27 PM IST

‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

MNCL: ప్రభుత్వ ఆసుపత్రులకు విచ్చేస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను శనివారం సందర్శించారు. వార్డులు, మందుల నిలువలు, ఆసుపత్రి పరిసరాలు, చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.

March 7, 2026 / 08:25 PM IST

తల్లులకు పాద పూజ చేసిన విద్యార్థులు

BHPL: పిల్లల జీవితంలో తల్లుల ప్రేమ, త్యాగం వెలకట్టలేనిదని ప్రతిబింభించారు ఓ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు. భూపాలపల్లిలోని ఓ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా.. విద్యార్థుల తల్లులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వారి వారి తల్లులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు.

March 7, 2026 / 08:23 PM IST

రేపటి పౌరులకు పూర్వ విద్యార్థులు కానుక..!

GDWL: గట్టు మండలం ఆరగిద్ద జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1988-1989 బ్యాచ్ గద్వాల రవీంద్ర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని శనివారం అందజేశారు. ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేసి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. తాము చదువుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

March 7, 2026 / 08:21 PM IST

పోలీస్ ఉద్యోగంతో సేవలు.. క్రీడలతో ప్రతిభ

MBNR: అడ్డాకల్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి. రాధిక క్రీడా రంగంలో తన ప్రతిభతో పోలీసు శాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఇటీవల సైబరాబాద్‌లో నిర్వహించిన పోటీలలో ఆమె బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి ఆమెను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధిస్తూ మరింత ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

March 7, 2026 / 08:20 PM IST

విద్యుత్ కార్మికుల మహా ధర్నా

MDK: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న టీజీఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ‘TVAE’ జేఏసీ ఛైర్మన్ బీఎన్ స్వామి పేర్కొన్నారు. ఆ రోజే సమ్మె నోటీసు కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. తూప్రాన్‌లో జేఏసీ కన్వీనర్ ఎస్కే షాదుల్ హుస్సేన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

March 7, 2026 / 08:20 PM IST

కేజీవీబీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఇల్లందలో ఉన్న KGBV బాలికల పాఠశాలను శనివారం MLA కె.ఆర్. నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువులో రాణించాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 08:19 PM IST

కొత్త వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని వినతి

RR: చేవెళ్ల పరిధి అంతారం గ్రామ సర్పంచ్ రామస్వామి మిషన్ భగీరథ డీఈ హారికను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతారం గ్రామంలో పాత వాటర్ ట్యాంక్ వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతో దాని స్థానంలో కొత్త ట్యాంక్ నిర్మించాలని డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యుడు ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.

March 7, 2026 / 08:19 PM IST

ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు

GDWL: నదీ తీర ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుంది అని అయిజ ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం పులికల్ శివారులోని తుంగభద్ర నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి, ఇసుకతో సహా వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 7, 2026 / 08:17 PM IST

కామినేని ఆసుపత్రి నుంచి రోగి అదృశ్యం

NLG: నల్లగొండ సుందరయ్య కాలనీకి చెందిన టంగుటూరి ఎల్లయ్య(60), మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి రాగా, అక్కడ కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుమార్తె ఆదిమూలం మహాలక్ష్మి ఫిర్యాదు చేయగా, నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్లయ్య కూలి పని చేసేవాడు.

March 7, 2026 / 08:17 PM IST

‘ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం’

PDPL: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను సన్మానించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో 26 మంది వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేశారు.

March 7, 2026 / 08:15 PM IST

విద్యాశాఖ పనితీరులో జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

KMM: విద్యాశాఖ పనితీరులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచిస్తూ, మార్చి 6 నుంచి 15 వరకు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. పాత సామాగ్రిని తొలగించి, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు.

March 7, 2026 / 08:15 PM IST

పొలాలకు గుడి చెరువు నీటి విడుదల

SRCL: వేములవాడ పట్టణంలోని గుడి చెరువు తూము నుంచి వేములవాడలో గల పంట పొలాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మిడ్ మానేరు నుంచి చెరువులోకి నీటిని పంపింగ్ చేయాలని, అలాగే గుడి చెరువు నుంచి లక్ష్మీపూర్ పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్ ఆదేశాలు జారీ చేశారు.

March 7, 2026 / 08:14 PM IST