• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘తల్లిని చంపింది కొడుకే’

KNR: రామడుగు గ్రామంలో ఈరెళ్ల గౌరమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం ఏసీపీ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గౌరమ్మ (55) మహిళను కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డబ్బులు, బంగారం విషయంలో తలెత్తిన వివాదంతో తల్లిని చిన్న కుమారుడు అనిల్ కుమార్ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

March 8, 2026 / 07:00 AM IST

సమస్యలపై అదనపు కలెక్టర్కు ఎమ్మెల్యే విన్నపం

SRD: ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందడం లేదని చెప్పారు. అంతేకాకుండా గ్రామాల్లో మంచినీటి సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకోవాలన్నరు.

March 8, 2026 / 06:58 AM IST

జాతీయ గీతాలాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద శనివారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రతిరోజూ ఇక్కడ జరిగే ‘జనగణమన’ గీతాలాపనలో భాగంగా ఆయన స్థానికులు, యువతతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణతో పాటు దేశభక్తిని పెంపొందిస్తాయన్నారు.

March 8, 2026 / 06:57 AM IST

వ్యభిచార గృహంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

WNP: వ్యభిచార గృహంపై దాడి చేసిన ఘటన వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి పట్టణంలోని కేడీఆర్ నగర్‌కు చెందిన నారమ్మ, బాలస్వామి, రమేశ్‌లు కలిసి ఓ ఇంట్లో మహిళల చేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

March 8, 2026 / 06:57 AM IST

రేపు గోదావరి జలాల పునరుద్ధరణ

SRPT: యాసంగి సీజన్‌కు గాను వారబందీ విధానంలో వస్తున్న గోదావరి జలాలు సోమవారం పునరుద్ధరించనున్నారు. ఆదివారం నీరు రావాల్సి ఉండగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడం ఆలస్యం కావడంతో సోమవారం రానున్నాయి. నీటి పునరుద్ధరణ జరిగాక వారం రోజుల పాటు వారబందీ విధానంలో ఐదవ తడిగా గోదావరి జలాలు రానున్నాయని ఆ శాఖ అధికారులు శనివారం సాయంత్రం తెలిపారు.

March 8, 2026 / 06:56 AM IST

కలెక్టర్ ఆదర్శ్ సురభికి సీఎం ప్రశంసలు

వనపర్తి: విద్యా రంగంలో జిల్లా సత్తా చాటింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి నాయకత్వంలో పీఎం పోషణ్ అమలులో 95 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం, విద్యా శాఖ పనితీరు సూచికలో ద్వితీయ స్థానం సాధించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% గ్యాస్ కనెక్షన్లు కల్పించడం విశేషం. ఈ విజయాల పై ఇటీవల జరిగిన కలెక్టర్ల సమ్మిట్‌లో సీఎం కలెక్టర్‌ను అభినందించారు.

March 8, 2026 / 06:55 AM IST

‘ట్రేడ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలి’

NRML: ఖానాపూర్ పట్టణంలోని వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పట్టణంలోని వ్యాపారస్తులు ఆ తేదీలోపు ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో 25% పెనాల్టీ విధించడం జరుగుతుందని, వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలాన్నారు.

March 8, 2026 / 06:52 AM IST

న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం

PDPL: గోదావరిఖనిలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏఐటీయూసీ, NFAW నాయకులు సంఘీభావం తెలిపారు. వన్ టౌన్ సీఐ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని ఏఐటీయూసీ నేత అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు మద్దతు ఉంటుందన్నారు.

March 8, 2026 / 06:49 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. కలెక్టర్ సూచనలు

HNK: నగరంలోని బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమం కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను అదేశించారు. మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్, వేదిక వంటి ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

March 8, 2026 / 06:48 AM IST

రాజన్న క్షేత్రంలో ఘనంగా సదస్యం

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ శివకళ్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి సదస్యం ఘనంగా నిర్వహించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో శ్రీ శివ కళ్యాణ మహోత్సవాల ప్రత్యేక పూజలను ప్రధాన ఆలయంలో అంతరంగికంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి సదస్యము, ఔపాసనం, బలిహరణం గావించారు.

March 8, 2026 / 06:46 AM IST

సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకురావాలి: SP

ADB: వ్యాపార సంస్థల సంఘాలు స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. సురక్షితమైన ఆదిలాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు జరగకుండా, జరిగిన వాటిని కనుగొనేందుకు సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం అని పేర్కొన్నారు.

March 8, 2026 / 06:42 AM IST

గురుకులంలో తనిఖీ చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్

WGL: రాయపర్తి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల-కళాశాలలో శనివారం ఉమ్మడి జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. వంట గది పరిస్థితులు, ఆహార పదార్థాల నిల్వలను కూడా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్ సరిత, తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 06:41 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

KMM: రఘునాథపాలెం మండలం కొలనుకుంటలో పేకాట ఆడుతున్న స్థావరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 8, 2026 / 06:40 AM IST

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

VKB: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మంచి పేరు సాధించాలని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎక్కడైతే మహిళలకు గౌరవం లభిస్తుందో అక్కడ అన్ని విధాలుగా సుభిక్షం కలుగుతుందన్నారు.

March 8, 2026 / 06:35 AM IST

నానో ఎరువులతో అధిక దిగుబడులు: ఏడీఏ

RR: సాగులో నానో యూరియా, డీఏపీ వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని ఏడీఏ శోభారాణి, ఏవో శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం ఆమనగల్లులో ‘ఆత్మ’ పథకం కింద రైతులకు నానో ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. సాంప్రదాయ ఎరువుల కంటే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని, ప్రస్తుత యాసంగి సాగులో వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

March 8, 2026 / 06:33 AM IST