WNP: వ్యభిచార గృహంపై దాడి చేసిన ఘటన వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి పట్టణంలోని కేడీఆర్ నగర్‌కు చెందిన నారమ్మ, బాలస్వామి, రమేశ్‌లు కలిసి ఓ ఇంట్లో మహిళల చేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.