WGL: రాయపర్తి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల-కళాశాలలో శనివారం ఉమ్మడి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. వంట గది పరిస్థితులు, ఆహార పదార్థాల నిల్వలను కూడా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్ సరిత, తదితరులు పాల్గొన్నారు.