పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. 14–15 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణం పూర్తయి, ఇటీవలే వర్చువల్ వేదికగా సీఎం ప్రారంభించిన నేపథ్యంలో కార్యకలాపాలను కొనసాగించేందుకు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
JGL: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల నూతన భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు.
BDK: జూలూరుపాడ్ మండలం బేతలపాడు గ్రామంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో ఆదివారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ASF: సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని ఇటుకలపహాడ్ బీట్లో వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఆదివారం పర్యటించారు. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన చెక్ డ్యాంలు, సోలార్ నీటి కుంటలు, కెమెరా ట్రాప్లను పరిశీలించాడు. మహారాష్ట్ర నుంచి పులులు ప్రవేశించే ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలో జర్నలిస్ట్ చంద్రశేఖర్‌పై జరిగిన భౌతిక దాడిని TRP జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. KGBV పాఠశాల గోడ నిర్మాణంలో నాణ్యత లోపాలను ఎత్తిచూపుతూ వార్త రాసిన జర్నలిస్టుపై దాడులు అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని, కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి మైసమ్మ ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆదివారం సీఐ, SIలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు డీఎస్పీని ఘనంగా సన్మానించారు. పోలీసు అధికారుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
SRD: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులైన ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
NGKL: అచ్చంపేట బస్టాండ్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో జనం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KMR: పట్టణంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ (42) అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య రేణుక ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
GDWL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ వంట గ్యాస్ ధరలు పెంచి ఆడబిడ్డల కడుపు కొట్టడమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కానుకనా అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలో గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా ధర్నా చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయన్నారు.
SRD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం ఒక సాంప్రదాయ వేడుక కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళల పోరాటాలను గుర్తించేందుకు జరుపుకునే రోజు అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు మహిళలు తల ఎత్తి నిలబడ్డ క్షణాలను గుర్తించే రోజు అని పేర్కొన్నారు. మహిళలపై ఉన్న ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలని, లింగ వివక్షను నిర్మూలిస్తూ మహిళలపై జరిగే దాడులను ఆపాలని అన్నారు.
MBNR: జడ్చర్లలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవిత భాగస్వామి శ్వేతా లక్ష్మారెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి నాటి నుంచి తన ప్రతి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఆమె లేని లోటు తీరనిదని, ఆ జ్ఞాపకాలు తనను నిరంతరం కుదిపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
SDPT: వ్యాసమహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సామూహిక ఆయుర్వేద మడ్ బాత్ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట కోమటి చెరువు సమీపంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 80 మంది ఆరోగ్య అభిలాషూలు పాల్గొన్నారు. గో మూత్రం, పాలు, నెయ్యి, తులసి, పసుపు, వేప, నిమ్మ మొదలగు 25 రకాల మూలికలను చెరువు మట్టితో కలిపి మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని యోగ చేశారు.