NZB: రుద్రూర్ మండలం రాయకూర్ 33/11 కేవీ సబ్ స్షేషన్లో అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రాయకూర్, సిద్ధాపూర్, రాణంపల్లి, సులేమాన్ నగర్, లింగంపల్లి, చిక్కడపల్లి గ్రామాల్లో కరెంటు ఉండదని పేర్కొన్నారు.