ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ వారం జిల్లా సైబర్ కార్యాలయానికి 8 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. సైబర్ నేరానికి గురైన వెంటనే ప్రజలు 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు.