SRD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిన్నారం మున్సిపాలిటీ ఊట్ల గ్రామంలో సోమవారం ఉదయం 7 గంటలకు నిర్వహించిన 5K రన్‌ను మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. వార్డు కార్యాలయం నుంచి జిన్నారం మున్సిపల్ కార్యాలయం వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.