MDCL: జిల్లా పరిధిలో ఈ వేసవి కాలంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ శిక్షణ అందించనున్నారు. ఏ అంశాలపై శిక్షణ అవసరమో తెలుసుకునేందుకు సర్వే ఫారమ్‌ను అధికారిక కేంద్రాలకు పంపించారు. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.