MNCL: చెన్నూరు పట్టణంలోని 9వ వార్డు మేదరివాడలో బోర్వెల్కు సోమవారం నూతన మోటార్ ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులో కాలనీవాసులకు నీటి ఎద్దడి ఏర్పడకుండా పాడైపోయిన మోటార్ స్థానంలో నూతన మోటార్ ఏర్పాటు చేసి ముందస్తు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వార్డు కౌన్సిలర్ పేర్కొన్నారు. నూతన మోటారు అందజేసిన మంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.