KMM: మధిర మండలం రాయపట్నంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ కంచం గోపి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది డ్రైనేజీలు శుభ్రం చేసి త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.