• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎస్సీ కమ్యూనిటీ హాల్ దుస్థితి దయనీయం

BDK: భద్రాచల పట్టణంలో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా, మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిందని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ చెత్త చదారాలతో, నిండిందని ఇవాళ మండిపడ్డారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెచ్చులు ఊడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 9, 2026 / 08:34 PM IST

యావపూర్ గ్రామంలో వైద్య శిబిరం

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించి రోగులకు మందులు అందజేసినట్లు సర్పంచ్ యంజాల స్వామి తెలిపారు. ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు స్వామి వివరించారు. పేదలకు వైద్య సహాయం అందజేసేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

March 9, 2026 / 08:33 PM IST

తాడిచెట్టు ఎక్కుతూ జారిపడ్డ గీతాకార్మికుడు

WGL: పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు కోల శ్రీనివాస్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కింద పడిపోయాడు. ఈ ఘటనలో వెన్నుముక, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానిక గౌడులు అంబులెన్స్‌లో MGM ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గౌడ సంఘం నేతలు కోరుతున్నారు.

March 9, 2026 / 08:33 PM IST

అభినందనలు తెలిపిన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు

KNR: రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏం నరేందర్ రెడ్డికి సాయంత్రం అధికారులు నియామక పత్రాన్ని అందజేసిన కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 9, 2026 / 08:32 PM IST

‘పెన్షన్ల పెంపు రైతు భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలి’

NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపు రైతు భరోసా నిధులు ఇకనైనా విడుదల చేసి పేద రైతులు పెన్షన్ దారులు ఆదుకోవాలని సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపు రైతు భరోసా నిధులు సాగు చేసుకుంటున్నా పేద రైతులకు పట్టాలు అందజేయాలని అని అన్నారు.

March 9, 2026 / 08:30 PM IST

తూప్రాన్ పట్టణంలో 2కే రన్

MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీలో కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో 2K-RUN నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్స్, పట్టణ పోలీసు సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. విజేతలకు కమిషనర్ బహుమతులు ప్రధానం చేశారు.

March 9, 2026 / 08:30 PM IST

పోతంగల్ నూతన తహసీల్దార్ రంజిత్

NZB: పోతంగల్ నూతన తహసీల్దార్‌గా రంజిత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గంగాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు. కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

March 9, 2026 / 08:27 PM IST

మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన

ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.

March 9, 2026 / 08:27 PM IST

రామగుండం ఐటీఐలో షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభం

PDPL: రామగుండం గవర్నమెంట్ ఐటీఐలో నిర్వహించిన ఏటీసీ షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఇలాంటి కోర్సులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.

March 9, 2026 / 08:25 PM IST

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం’

JN: రఘునాథపల్లి, ఎల్లారెడ్డిగూడెం, దాసన్నగూడెం గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ… మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతుందని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

March 9, 2026 / 08:25 PM IST

‘కుష్ఠు/బోద వ్యాధుల నివారణపై ప్రజలను చైతన్య పరచాలి’

ASF: కళాజాత ప్రదర్శనల ద్వారా జిల్లాలో కుష్ఠు/బోద వ్యాధుల నివారణపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో జిల్లాలో కుష్ఠు/బోద వ్యాధులపై అవగాహన కోసం కళాజాత ప్రదర్శన రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

March 9, 2026 / 08:23 PM IST

కాంస్య పతకం సాధించిన భాస్కర్‌కు కలెక్టర్ సత్కారం

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ ప్యారా గేమ్స్‌లో రాష్ట్ర స్థాయి వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో కాంస్య పతకం సాధించిన బుర్ర భాస్కర్‌ను సోమవారం కలెక్టరేట్లో సత్కరించారు. మోతె గ్రామానికి చెందిన భాస్కర్, 2025లో జరిగిన ఈ పోటీలలో జిల్లాకు గౌరవం తెచ్చారు. కలెక్టర్ ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

March 9, 2026 / 08:18 PM IST

సంగెంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

WGL: సంగెం మండలంలో కేజీబీవి, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం సంగెం మండల కేంద్రంలోని కేజీబీవీ, ఎంఆర్సీ కేంద్రాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరారు.

March 9, 2026 / 08:18 PM IST

‘కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’

BDK: పినపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రెటరీ గద్దల సమ్మయ్య తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పినపాక, ఏడూళ్ల బయ్యారం రావిగూడెం పరిధిలో గోదావరికి అడ్డుకట్ట కట్టిన ఇసుక రైసింగ్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 9, 2026 / 08:15 PM IST

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

MHBD: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని MLA డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. నెల్లికుదురు పట్టణంలోని రైతు వేదికలో సోమవారం మండల స్థాయి అధికారులతో సమీక్ష, నూతన సర్పంచుల ముఖాముఖి కార్యక్రమంలో MLA ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతన సర్పంచ్లు విధివిధానాలపై అవగాహన పెంచుకొని పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

March 9, 2026 / 08:15 PM IST