WGL: పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు కోల శ్రీనివాస్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కింద పడిపోయాడు. ఈ ఘటనలో వెన్నుముక, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానిక గౌడులు అంబులెన్స్‌లో MGM ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గౌడ సంఘం నేతలు కోరుతున్నారు.