ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.