MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.