• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై

MDK: యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి SI ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాటాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

March 10, 2026 / 10:44 AM IST

పలు బీట్లలో చెలరేగిన మంటలు.. ఆర్పివేసిన అధికారులు

ASF: అడవి సంపదకు నిప్పు పెట్టడం మానవజాతికి ముప్పు కల్గిస్తుందని జోడేఘాట్ FRO రమేష్ హెచ్చరించారు. పశువుల కాపర్లు, బాటసారులు అజాగ్రత్తగా పడేసే నిప్పు వల్ల అడవితో పాటు వన్యప్రాణులు దహించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్‌లో పలు బీట్లలో రాజుకున్న మంటలను అధికారులు, సిబ్బందితో కలిసి ఆర్పేశారు.

March 10, 2026 / 10:44 AM IST

కొత్తపల్లి గ్రామ సమస్యలను పరిష్కరించాలని వినతి

HNK: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్రామ ప్రజాప్రతినిధులు, నేతలు వినతిపత్రం అందజేశారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని వారు కోరారు. సర్పంచ్ ప్రదీప్, తదితరులు ఉన్నారు.

March 10, 2026 / 10:41 AM IST

భార్య ప్రవర్తనతో మనస్తాపం.. ప్రాణం తీసుకున్న భర్త

VKB: మర్పల్లి మండలం కొమ్‌సేట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య రత్నమాల మరొకరితో సన్నిహితంగా ఉండటం గమనించి ఆమెను నిలదీశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

March 10, 2026 / 10:40 AM IST

గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: రూపేష్ రెడ్డి

ADB: గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. బేల మండలంలోని సదలపూర్ గ్రామంలో వివో భవనానికి సర్పంచ్ మంగేష్‌తో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

March 10, 2026 / 10:35 AM IST

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోస్రాలో 38.9°C, భీంగల్ 38.7, ఎర్గట్ల, నిజామాబాద్ 38.4, మంచిప్ప, ఆలూరు 38.3, మెండోరా 38.2, పెర్కిట్, బాల్కొండ 38.1, కోటగిరి, గోపన్ పల్లి 38°Cలు నమోదయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లాలో ఎల్పుగొండ 38.3°C, కొల్లూరు, బీర్కూర్ 38°Cల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

March 10, 2026 / 10:33 AM IST

వార్డులలో వేగంగా సీసీ రోడ్ల నిర్మాణం

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉన్న పలు కాలనీలలో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. స్థానిక డాంబర్ రోడ్డు నుండి భగత్ సింగ్ నగర్ ట్యాంక్ వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ మేరకు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

March 10, 2026 / 10:31 AM IST

కోదాడ 28వ వార్డులో పారిశుధ్య పనులు

SRPT: కోదాడ పట్టణం 28వ వార్డులో మంగళవారం “మన వార్డు – మన శుభ్రత” కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనన్న మిత్రమండలి సభ్యులు కలిసి వార్డులోని మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 10, 2026 / 10:31 AM IST

‘ కేంద్రం 29 చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చింది’

PDPL: కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చిందని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ పుష్టి అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GM ఆఫీసులో సోమవారం అధికారులు, ఉద్యోగులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లేబర్ కోడ్‌లపై అవగాహన కల్పించారు. కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత, వేతనాలు, ఉద్యోగ వ్యవస్థ తదితర ఉపయోగకర విషయాల గురించి వివరించారు.

March 10, 2026 / 10:29 AM IST

‘సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి’

RR: ప్రతి మహిళ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా SDNR పట్టణంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. అణగారిని వర్గాల్లో విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంస్కర్త అని పేర్కొన్నారు.

March 10, 2026 / 10:29 AM IST

ఇంటర్ పరీక్షలో విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు

KMM: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 18,351 మంది విద్యార్థులకు గాను 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఒక కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

March 10, 2026 / 10:27 AM IST

హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి: రామాచారి

SRD: హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టివారికి నాణ్యమైన భోజనం, విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి రామాచారి అన్నారు. మునిపల్లిలోని SC హాస్టల్‌ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని సూచించారు. అనంతరం కిచెన్, స్టోర్ గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్ రామప్పకు సూచించారు.

March 10, 2026 / 10:23 AM IST

‘శానిటరీ కాంప్లెక్స్ వెంటనే అందుబాటులోకి తేవాలి’

NGKL: వెల్దండ మండలంలోని గుండాల శివాలయాన్ని ఎంపీడీవో కృష్ణయ్య దర్శించుకున్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ నాణ్యతను, సౌకర్యాలను తనిఖీ చేశారు. శివాలయానికి వచ్చే భక్తులకు, స్థానికులకు ఇబ్బంది కలగకుండా, నిర్మించిన శానిటరీ కాంప్లెక్స్‌‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్‌కు సూచించారు.

March 10, 2026 / 10:19 AM IST

నేడు అక్రమంగా పట్టుబడ్డ వాహనాలు బహిరంగ వేలం

MLG: జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ MLG పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేళలో పాల్గొనాలనుకునే వారు అప్సెట్ ధరలో 50% మొత్తం ధరావత్తుగా చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సమయానికి హాజరై వేలంలో పాల్గొనాలని సూచించారు.

March 10, 2026 / 10:18 AM IST

కేటీఆర్‌ను కలిసిన నాగుర్ల వెంకటేశ్వర్లు

WGL: తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ రైతు రుణ విమోచన కార్పొరేషన్ ఛైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు కలిశారు. అనునిత్యం బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ తనకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

March 10, 2026 / 10:18 AM IST