VKB: మర్పల్లి మండలం కొమ్సేట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య రత్నమాల మరొకరితో సన్నిహితంగా ఉండటం గమనించి ఆమెను నిలదీశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.