ADB: విద్యార్థులు నిర్భయంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే శీలా అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాటశాల 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్స్ అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఉపాద్యాయులు స్టూడెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలన్నారు.