MNCL: లక్సెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ‘పూర్వ ప్రాథమిక విద్య ప్లే కం రీడింగ్ కార్నర్ రూమ్’ను ఎంఈవో శైలజ మంగళవారం ప్రారంభించారు. పూర్వ శిశు విద్యార్థులకు ఈ రీడింగ్ రూమ్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరావుపేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, గ్రామ సర్పంచ్ సందెల సుజాత, ఉపసర్పంచ్ బొప్పు సుమన్ పాల్గొన్నారు.
WGL: చెన్నరావుపేట మండలం రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS తరుపున కంది శ్వేతారెడ్డి సర్పంచ్‌గా గెలిపొంది అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమె భర్త కంది కృష్ణ చైతన్య రెడ్డి ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో ఉండటంతో స్థానిక నాయకుల్లో ఆందోళన నెలకొంది.
NRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్వ మండలంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంఈవో రాంరెడ్డి ఆధ్వర్యంలో తపస్ సంఘం సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ వారు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో TPUS మండలాధ్యక్షుడు వసంత్ కుమార్, సెక్రటరీ రాజు పాల్గొన్నారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చిట్యాల మండలం, బొంగోనిచెరువులో వీధులు, మురికి కాలువలను ఇవాళ శుభ్రం చేశారు. సర్పంచ్ కట్ట ఆశయ్య, ఉపసర్పంచ్ సామిడి సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యదర్శి లింగస్వామి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పుష్ప, యాదిరెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
NZB: మాక్లూర్ మండలం ధర్మోరకి చెందిన మోహన్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 1.75 లక్షల ఎల్వోసీ మంజూరైంది. మంగళవారం ఆయన ఈ పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపదలో అండగా నిలిచిన వినయ్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
NGKL: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న టీకాలను ఇప్పించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రైతులకు సూచించారు. బల్మూరు మండల జినుంట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గాలికుంటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అమలు చేసిన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLG: ప్రతి ఒక్కరూ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం తీదేడు( వెంకటంపేట) లో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
NLG: ప్రతి ఒక్కరూ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం తీదేడు( వెంకటంపేట) లో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామం నుంచి సంఘాల రోడ్డువరకు బీటీ రోడ్డు వేశారు. అయితే సైడ్లకు మట్టి వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన లోతుగా ఉండటంతో వాహనాలు జారి పలువురు గాయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే సైడ్ మట్టి వేయాలని ప్రజలు కోరుతున్నారు.
KMM: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పట్టణంలో ‘2కే రన్’ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఛైర్‌పర్సన్ సామినేని సుజాత ఆధ్వర్యంలో ఉదయం 6:30 గంటలకు స్థానిక ట్యాంక్ బండ్ నుంచి అంబారుపేట శివారు వరకు ఈ పరుగు పందెం కొనసాగుతుంది.
PDPL: రామగుండంలో కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతుంది. రామగుండం కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ఏదో ఒక కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు కార్పొరేషన్ అధికారులు వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులపై దాడులకు దిగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
MLG: జంగాలపల్లి గ్రామంలోని బ్రాహ్మణి విద్యాలయంలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పట్ల గౌరవభావన పెంపొందించుకోవడం ప్రతివిద్యార్థి కార్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ విలువలు, సంస్కారం,పెద్దల పట్ల గౌరవం విద్యార్థుల్లో పెంపొందుతాయని వారు పేర్కొన్నారు
MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూలబొకే అందజేసి తన నియామకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం సైతం వేం నరేందర్‌కు అభినందనలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సీఎం ఆయనకు సూచించారు.
WGL: నగరంలోని 48, 49 డివిజన్‌లలో రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
BDK: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి అర్పించారు. మహిళల విద్యకు పునాది వేసిన మహనీయురాలు అని కొనియాడారు.