• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లింగంపేట రైల్వే స్టేషన్ దారిలో దుర్గంధం

JGL: జగిత్యాల-లింగంపేట రైల్వేస్టేషన్ దారిలో దుర్గంధం వెదజల్లుతోంది. రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రారంభ మార్గంలోనే చెత్తాచెదారం వేయడంతో పాటు కుక్కలు తిరుగుతుండటం వల్ల రోడ్డంతా కంపు కొడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

March 10, 2026 / 03:03 PM IST

ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన ఏఎంసీ ఛైర్మన్

NZB: మోపాల్ మండలంలోని ముదక్ పల్లిలో మంగళవారం ప్రభుత్వం ద్వారా మంజురైనా, ఇందిరమ్మ ఇళ్ళకి ఏఎంసీ ఛైర్మన్ ముప్పా గంగారెడ్డి భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల వారికీ, సమన్వయం జరిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు.

March 10, 2026 / 03:03 PM IST

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

NLG: దేవరకొండ స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తన సతీమణి జ్యోతి ప్రసన్నతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పున్న శైలజ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మహిళలు పాల్గొన్నారు.

March 10, 2026 / 03:02 PM IST

బాన్సువాడ ఇంటర్మీడియట్ పరీక్షలు 97.89శాతం హాజరు

KMR: బాన్సువాడ పరిధిలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 1,852 మంది విద్యార్థులకు గాను 1,813మంది పరీక్షకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 39 మంది గైర్హాజరు కావడంతో 97.89శాతం హాజరు నమోదైంది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాన్నారు.

March 10, 2026 / 03:02 PM IST

99 రోజుల కార్యాచరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

SRPT: కోదాడలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ అమలును జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఈరోజు పరిశీలించారు. పట్టణంలోని డ్రైనేజీ కాలువలు, రోడ్ల శుభ్రత పనుల పురోగతిని మున్సిపల్ కమిషనర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు.

March 10, 2026 / 03:02 PM IST

ఇంటికి చేరిన రాజయ్య మృతదేహం

PDPL: రామగుండం గౌతమి నగర్‌కు చెందిన కొప్పుల రాజయ్య రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో ఉన్న తన కుమారుడు ప్రసాద్ వద్దకు భార్యతో కలిసి వెళ్ళాడు. అయితే, ఈ నెల 3న గుండెపోటుతో రాజయ్య మరణించాడు. ఈ మేరకు రాజయ్య మృతదేహం గౌతమి నగర్‌లోని ఇవాళ ఆయన సొంత ఇంటికి చేరుకుంది. సంతోషంగా వెళ్లిన ఆ కుటుంబంలో రాజయ్య విగత జీవిగా రావడంతో కాలనీలో విషాదం అలుముకుంది.

March 10, 2026 / 02:58 PM IST

అలర్ట్.. సోలార్ ప్లాంట్ల ట్రయల్ రన్స్ ప్రారంభం..!

MNCL: మందమర్రి డివిజన్ సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ట్రయల్ రన్స్ ప్రారంభించినట్లు ప్రాజెక్టు మేనేజర్ శశిధర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 67.5 మెగావాట్స్‌కు సంబంధించిన 33KV ట్రాన్స్‌మిషన్ లైన్స్ ట్రయల్ రన్ ప్రారంభమైందన్నారు. శాంతిఖని మైన్, మ్యాగ్జిన్ సైట్, రడగంబాల, సోమగూడెం, కేకే 5 ఏరియాలోని టవర్ పరిసర ప్రాంతలకు ప్రజలు వెళ్ళవద్దని ఆయన సూచించారు.

March 10, 2026 / 02:55 PM IST

‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

MNCL: మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని జన్నారంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సచిన్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జన్నారం మండలంలోని ఐకేపీ కార్యాలయంలో స్థానిక ఏపీఎం లలిత, మహిళలను ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో RBI VIDS దండేపల్లి CFL కౌన్సిలర్స్ వేల్పుల రవీందర్, హరీష్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ నితిన్ పాల్గొన్నారు.

March 10, 2026 / 02:54 PM IST

హనుమాన్ దేవాలయం నూతన కార్యవర్గం ఎన్నిక

KNR: హుజూరాబాద్ మండలం రాంపూర్ హనుమాన్ దేవాలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ సంగీత గణేశ్ ఆధ్వర్యంలో కార్యవర్గంలో ధర్మకర్తగా సురకంటి సదానదం, అధ్యక్షుడిగా ఎం.గాలయ్య, ఉపాధ్యక్షుడిగా డి.నానాజీ, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, సంజీవ్, శ్రీకాంత్, బిక్షపతి, సంపత్ నరసింహస్వామిని ఎన్నుకున్నారు.

March 10, 2026 / 02:50 PM IST

‘లింగాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి’

PDPL: రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లింగాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సింగరేణి GM లలిత్ కుమార్‌కు కార్పొరేటర్ నిమ్మరాజుల రజని వినతిపత్రం సమర్పించారు. వేసవి దృష్ట్యా వాటర్ ప్లాంట్ పనులు పూర్తి చేయాలని, కొత్త బోర్లు వేయించాలని కోరారు. అలాగే, ఎస్సీ కాలనీకి R&R ప్యాకేజీ అమలు చేయడంతో పాటు మహిళలు, యువతకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.

March 10, 2026 / 02:49 PM IST

UIMOలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన..BHPL విద్యార్థిని

BHPL: జిల్లాలోని సింగరేణి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి. ఒలీవియా గణిత విభాగంలో అద్భుత ప్రతిభ చాటింది. జనవరిలో జరిగిన యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ (UIMO)లో ఆల్ ఇండియా 4,406వ ర్యాంకు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి తెలిపారు. ఈ సందర్భంగా HM ఝాన్సీ, కోఆర్డినేటర్ శ్రీనివాస్ విద్యార్థినిని అభినందించారు.

March 10, 2026 / 02:48 PM IST

‘ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ఉపసంహరించుకోవాలి’

WNP:  విద్యుత్ బస్సులతో ఆర్టీసీ ప్రమాదంలో పడే ప్రభావాలపై ఈ నెల 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సు కరపత్రాలను వనపర్తిలో ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఖయ్యూం, డిపో కార్యదర్శి నాగేశ్వర్‌లు మాట్లాడుతూ.. ఆర్టీసీలో విద్యుత్ బస్సులు నడపాలని ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

March 10, 2026 / 02:47 PM IST

సీతారాముల కళ్యాణ కరపత్రాల ఆవిష్కరణ

నిర్మల్: జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ రామాలయంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన కరపత్రాలను 9 వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన అర్చకులు రామానుజ చార్యులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

March 10, 2026 / 02:46 PM IST

లక్ష్మీదేవిపల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీఎస్పీ

VKB: శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, దొంగతనాల నివారణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

March 10, 2026 / 02:46 PM IST

కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేసిన డిప్యూటీ మేయర్

MBNR: జిల్లాలో 11వ డివిజన్ పరిధి గొల్ల బండ తండాకు చెందిన జమునకు ఈరోజు నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. అత్యవసర వైద్య సేవల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చొరవతో సంబంధిత అధికారులతో మాట్లాడి చెక్కును వెంటనే పంపిణీ చేసినట్లు తెలిపారు.

March 10, 2026 / 02:45 PM IST