MDK: పెద్దశంకరంపేట మండల కేంద్రంలో తప్పిపోయిన ఓ గుర్తుతెలియని బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాలుడి వివరాలు తెలియకపోవడంతో తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫొటోలో ఉన్న బాలుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా 8712657884 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై ప్రవీణ్ రెడ్డి కోరారు.
SRD: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల రెడ్డి కొనియాడారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా వ్యాపార రంగంలో మహిళలు ఎదిగేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలో పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని పంచాయతీ కార్యదర్శి కుమ్ర మోతిరాం అన్నారు. ఆయన మంగళవారం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్మికుల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయడం చేపట్టారు. వేసవి కాలం ప్రారంభమైన సందర్భంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.
NZB: వర్ని మండల కేంద్రమైన సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో చెత్త సేకరణ కోసం నూతన ఆటోలను కొనుగోలు చేశారు. 9 లక్షల వ్యయంతో వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ అయిన సత్యనారాయణపురంలో ఇంటింటా చెత్త సేకరించడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. మంగళవారం ఆటోలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
MNCL: అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. వేసవి నేపథ్యంలో మంగళవారం జన్నారంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అగ్నిప్రమాదల నివారణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం అందిస్తే మంటలను ఆర్పి వేస్తామని ఆయన పేర్కొన్నారు.
NRML: చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలంలోని మొర్రిగూడెం, హరిజనవాడ గ్రామాల్లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదుల తిరుపతి, నాయకులు మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.
MDK: భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో రూపొందించిన నక్షల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయడమే ఈ సర్వే లక్ష్యమని వివరించారు.
MDCL: ఘట్కేసర్ పరిధిలోని మేఘా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని గాయత్రి(23) అదృశ్యం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె, హాస్టల్ వార్డెన్ అనుమతితో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల వద్దకు కూడా చేరుకోకపోవడంతో వార్డెన్ ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
NZB: మెండోరాలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. సర్పంచ్ బుట్టడి ప్రమోద్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి అని కొనియాడారు. అణగారిన వర్గాల విద్యా వ్యాప్తి కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.
KMM: పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి బండారు ఐలయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, యుద్ధాన్ని సాకుగా చూపించి గ్యాస్ ధరలు పెంచడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: గ్లోబల్ విషయాలపై అవగాహన కోసం జరిగే మాక్ యుఎన్‌వోలో చిట్యాల జడ్పీ హైస్కూల్ విద్యార్థి గంజి శివసాయి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో శివసాయి, సాత్విక్ ప్రతిభ చాటగా, శివసాయి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు హెచ్‌ఎం సుశీల తెలిపారు. గైడ్ టీచర్ సైదులు, టీచర్లు చిలకరాజు శ్రీనివాస్, పద్మజ, కోణం శ్రీనివాస్ పాల్గొన్నారు.
NLG: గ్లోబల్ విషయాలపై అవగాహన కోసం జరిగే మాక్ యుఎన్‌వోలో చిట్యాల జడ్పీ హైస్కూల్ విద్యార్థి గంజి శివసాయి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో శివసాయి, సాత్విక్ ప్రతిభ చాటగా, శివసాయి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు హెచ్‌ఎం సుశీల తెలిపారు. గైడ్ టీచర్ సైదులు, టీచర్లు చిలకరాజు శ్రీనివాస్, పద్మజ, కోణం శ్రీనివాస్ పాల్గొన్నారు.
GDWL: గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ మూడో రోజుకు చేరుకుంది. సూపర్వైజర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేశారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ టీకా రక్షణ కల్పిస్తుందని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆమె తెలిపారు.
MBNR: జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం బిల్డింగ్ తండా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి గుడ్లు ఉడకబెట్టిన వేడి నీటిలో పడి ప్రైవేట్ భాగాలలో కాలిపోయింది. ఈ ఘటనపై చిన్నారి నానమ్మ మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు తమ బాధను విన్నవించుకున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
JN: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇవాళ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో శ్రీనిధి సంస్థలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఝాన్సీ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.