SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, పిల్లల వైద్య నిపుణులు, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారు. వివిధ గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.
HNK: భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, చదువు మన తలరాతను మారుస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

SRPT: గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జరిగిన సెమినార్‌లో మహిళలు హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
NZB: జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద మంగళవారం నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

ASF: కౌటాల మండలం తుమ్మిడిహేట్టిలో ఈ నెల 16న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గ్రామ కమిటీ సభ్యులు మహారాష్ట్రలోని రాజురా మున్సిపల్ ఛైర్మన్ అరుణ్ బావుకు అందజేసి ఆహ్వానించారు. ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
MLG: ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్, ఉపాధ్యాయులు పాల్గొని సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి, సమాజంలో సమానత్వానికి ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదని వారు కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.
NLG: నకిరేకల్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, మున్సిపల్ ఛైర్మన్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ASF: వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో మంగళవారం కళాజాత బృందంచే కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DMHO సీతారాం హాజరై పలు సూచనలు చేశారు. శరీరంపై రాగిరంగులో మచ్చలు కనిపిస్తే వెంటనే PHCకి వెళ్లి డాక్టర్ సూచనలు తీసుకోవాలని, కుష్ఠు వ్యాధి కోసం PHCలో ఉచిత మందులు లభిస్తాయన్నారు. 6 నెలల వైద్యం ద్వారా వ్యాధి నయమవుతుందన్నారు.
NRML: రానున్న గోదావరి నది పుష్కరాలకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

HNK: శాయంపేట మండలంలోని పశువైద్యశాలలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేసారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ.. ఈ టీకాలు వేయడం ద్వారా పశువులలో రోగనిరోధక శక్తి పెరిగి పశువులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యుత్పత్తి శక్తి పెరిగి రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.