• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రాయపర్తిలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం

WGL: రాయపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ గారే మహేంద్ర బిక్షపతి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేరి నివాళులు అర్పించారు. పూలే ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం అని, వాటిని కొనసాగించేలా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పూలే చేసిన పోరాటాలను గుర్తు చేశారు.

March 10, 2026 / 05:26 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన శీర్షా గ్రామ సర్పంచ్

ఆసిఫాబాద్: కౌటాల మండలం శీర్షా గ్రామ సర్పంచ్ గండ్ల మల్లేష్ ఉమ్మడి మంగళవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్, సర్పంచ్ మల్లేష్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి కాంగ్రెస్‌లో చేరినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.

March 10, 2026 / 05:25 PM IST

అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత

MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఆవులను గ్రామస్తులు పట్టుకున్నారు. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనంలో నాలుగు ఆవులు, నాలుగు లేగ దూడలను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పట్టుబడిన వాహనాన్ని, ఆవులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు.

March 10, 2026 / 05:25 PM IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

MDK: మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నా ఒక ఇన్నోవా కారు మాసాయిపేట బంగారమ్మ దేవాలయం సమీపంలో అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ఇద్దరికీ గాయాలయ్యాయి.

March 10, 2026 / 05:25 PM IST

‘పర్యాటక రంగ అభివృద్ధికి నివేదిక ఇవ్వాలి’

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, వాహనాల పార్కింగ్ అంశాలను పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అవసరమైన భూములను పరిశీలించి వివరాలతో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.

March 10, 2026 / 05:24 PM IST

‘కార్పొరేషన్లకు పాలక మండళ్లు నియమించాలి’

MNCL: రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు వెంటనే పాలక మండళ్లు నియమించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పదవి కాలం రెండేళ్లవుతున్న ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని తెలిపారు.

March 10, 2026 / 05:22 PM IST

“అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలి “

BHPL: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మార్చి 12న నిర్వహించనున్న మున్సిపల్ ఛైర్మన్‌లు, కౌన్సిలర్‌లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల శిక్షణా తరగతులకు మినిట్ టు మినిట్ కార్యక్రమం సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గ్రామాలు-పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

March 10, 2026 / 05:21 PM IST

కుకునూరుపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం

SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, పిల్లల వైద్య నిపుణులు, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారు. వివిధ గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.

March 10, 2026 / 05:19 PM IST

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ప్రభాకర్

HNK: భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, చదువు మన తలరాతను మారుస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

March 10, 2026 / 05:10 PM IST

ధరల పెరుగుదలపై ఐద్వా నిరసన

SRPT: గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జరిగిన సెమినార్‌లో మహిళలు హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

March 10, 2026 / 05:08 PM IST

జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని నిరసన

NZB: జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద మంగళవారం నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

March 10, 2026 / 05:06 PM IST

ఈ నెల 16న ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

ASF: కౌటాల మండలం తుమ్మిడిహేట్టిలో ఈ నెల 16న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గ్రామ కమిటీ సభ్యులు మహారాష్ట్రలోని రాజురా మున్సిపల్ ఛైర్మన్ అరుణ్ బావుకు అందజేసి ఆహ్వానించారు. ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 10, 2026 / 05:05 PM IST