ఆసిఫాబాద్: కౌటాల మండలం శీర్షా గ్రామ సర్పంచ్ గండ్ల మల్లేష్ ఉమ్మడి మంగళవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్, సర్పంచ్ మల్లేష్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి కాంగ్రెస్‌లో చేరినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.