SRPT: గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జరిగిన సెమినార్లో మహిళలు హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.