HNK: భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, చదువు మన తలరాతను మారుస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.