ADB: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో పర్యటించి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసాను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సిటీ ఆర్ముడ్ విభాగంలో సిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
NRPT: కృష్ణ మండలం గూడెబళ్లూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మక్తల్ ఇంఛార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై వారు పార్టీ కండువా కప్పుకున్నారు. యువత అంతా కలిసి ప్రజా సమస్యలపై పోరాడి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మణికంఠ గౌడ్ పిలుపునిచ్చారు.
NZB: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు హనుమాన్ జంక్షన్ ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ స్వయంగా హనుమాన్ స్వాములకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.
NRML: ఈ నెల 12న సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్‌లో సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు.

MNCL: చదువే మనిషికి జీవం కావాలని, విద్యను ఇష్టపడుతూ చదవాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రేరణాత్మక వక్త, రాష్ట్రపతి అంతర్జాతీయ అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అన్నారు. మంగళవారం జైపూర్ మండలం టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం “చదువు.. బడి.. తల్లిదండ్రులు.. పరీక్షలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ASF: జిల్లా అభివృద్ధికి సీపీఎం జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించమని కలెక్టర్ హరితకు వినతి పత్రం సమర్పించారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి రంగాల్లో సమస్యలపై దృష్టి సారించి పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, సైన్స్ సెంటర్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

VKB: జిల్లా వ్యాప్తంగా 8వ విడత ఉచిత గాలికుంట వ్యాధి నివారణ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. వికారాబాద్ పశువైద్య సిబ్బంది ఇప్పటివరకు 110 గేదెలకు, 15 ఆవులకు టీకాలు వేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జడ్పి సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠాలతో పాటు మత ప్రచారం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు మత ప్రచారం నిర్వహించడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని DEO స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
NZB: అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకాంక్షించారు. మంగళవారం సాయంత్రం బోధన్ పరిధిలోని ఆచన్‌పల్లిలో ముఫీ అతిక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ, ఇది ఆత్మపరిశీలన చేసుకునే సమయమని పేర్కొన్నారు.