VKB: జిల్లా వ్యాప్తంగా 8వ విడత ఉచిత గాలికుంట వ్యాధి నివారణ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. వికారాబాద్ పశువైద్య సిబ్బంది ఇప్పటివరకు 110 గేదెలకు, 15 ఆవులకు టీకాలు వేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.