ASF: జిల్లా అభివృద్ధికి సీపీఎం జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించమని కలెక్టర్ హరితకు వినతి పత్రం సమర్పించారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి రంగాల్లో సమస్యలపై దృష్టి సారించి పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, సైన్స్ సెంటర్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.