WGL: నెక్కొండ (M)కేంద్రంలోని వెంకటాపురం గంగాదేవి తండాలో మంగళవారం దుర్గమ్మ బోనాల పండుగ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.
SRPT: అనంతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఇవ్వాళ ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సలీమా మాట్లాడుతూ.. విద్యార్థులందరూ వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
WNP: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రాంజీ ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు.పెద్దగూడెం,కడుకుంట్ల, మెంటేపల్లి, నాచహళ్లి గ్రామాల ఉపాధిహామీ కూలీలతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యంచేసేందుకు కేంద్రం చేస్తున్న కొట్రాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు
BHNG: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట ఎంఆర్‌సీ కార్యాలయంలో ఎంఈవో చందా రమేష్ అధ్యక్షతన సర్పంచులు, ప్రధానోపాధ్యాయుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు.
MHBD: జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ కులానికి చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయసన్మాన కార్యక్రమాన్ని ఈనెల 14న నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సినీ హీరో సుమన్‌ను ఆహ్వానించారు. మంగళవారం HYDలో ఆయనని కలిసి ఆహ్వానపత్రిక ఇచ్చారు.
KMR: పల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన పలువురు CITU నాయకులు ఆ సంఘానికి రాజీనామా చేసి, మంగళవారం తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘంలో చేరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని, వారి హక్కులను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య ఉన్నారు.
BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్–8లో ఉన్న ప్రభుత్వ భూమిలో 3ఎకరాలను అర్హులైన పేదలకు కేటాయించాలని స్థానిక పేదలు అనేక రోజులుగా గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నారు. ఈ సందర్భంగా పేదల తరఫున మంగళవారం CPI జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, MLA కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు, MLC నెల్లిగంటి సత్యంలకు మెమొరాండం అందజేశారు.
MDCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల లైబ్రరీలో బుక్స్ ఎగ్జిబిషన్‌ను VC కిషన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన కందుకూరి మంగ ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్‌గా ఎంపికయ్యారు. ఈరోజు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సీతారామారావు చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నారు. విధి నిర్వహణలో ఆమె కనబరిచిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు.
MHBD: జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలువురు దంతవైద్యులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా జిల్లాలో మొట్టమొదటి దంతవైద్యడు డాక్టర్ అనీల్ గుప్తను ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.వీరన్న నాయక్, డా.లెనిన్ చంద్ర, డా.రాకేష్, సుమంత, తదితరులున్నారు.
KMM: మార్చి 12న భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా ప్రతినిధులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
SDPT: పదవ తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని గజ్వేల్ రూరల్ సీఐ రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్ రెడ్డి సూచించారు. క్షీరసాగర్‌లో ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులతో పాటు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి ఉదయ భాస్కర్ రెడ్డి పాల్గొని పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
NRPT: దామరగిద్ద ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని విజయలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మనకు విద్య నేర్పిన గురువులకు ఘనంగా వీడ్కోలు పలికే సంస్కృతీ మనదన్నారు. ప్రతీ ఒక్కరు తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించాలన్నారు.
NZB: భీమగల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధ్యక్షుడిగా తిరునగరి పృధ్విరాజ్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమోహన్, కోశాధికారిగా బ్రహ్మానంద్ ఎన్నికయ్యారు. పృధ్విరాజ్ మాట్లాడుతూ.. యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, డీ.ఎస్. రవి, శ్రీనాథ్, దామోదర్, ప్రమోద్, చంద్రశేఖర్ ఉన్నారు.
NGKL: ప్రజా పాలన 99 రోజుల ప్రత్యేక సేవలలో భాగంగా వెల్దండ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గుండాల ఏకలవ్య మోడల్ పాఠశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పోషకాహార లోపాలపై అవగాహన కల్పించిన ఈ కార్య క్రమంలో వైద్యులు, ఫార్మసీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.