• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలి: కలెక్టర్

BHNG: ప్రభుత్వ పాఠశాలలు, SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, దీనిపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. నిబంధనల ప్రకారం భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు.

March 10, 2026 / 09:10 PM IST

‘బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలి’

SRPT: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కనకయ్య కోరారు. ఈరోజు చిలుకూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు.

March 10, 2026 / 09:05 PM IST

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

KMR: సంగోజివాడి గ్రామంలో సీఎం, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ చిత్రపటాలకు మంగళవారం మహిళలు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.

March 10, 2026 / 09:05 PM IST

విద్యార్థులు ఆరోగ్య వివరాలు ఆరా తీసిన DMHO

BDK: మణుగూరు బీసీ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు తీసుకున్న ఆహార వివరాలను  DMHO మంగళవారం అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన, చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు.

March 10, 2026 / 09:05 PM IST

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నగరంలో బోనాల పండుగ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే★  గవిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి★ వర్ధన్నపేటలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు★ వరంగల్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబల్ రోడ్డు ప్రమాదంలో మృతి

March 10, 2026 / 09:00 PM IST

1.3 కేజీల గంజాయి పట్టివేత

MDCL: ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడ, పర్వతాపూర్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు కుమ్మరి గోపి వద్ద 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మున్నా అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.

March 10, 2026 / 08:59 PM IST

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

KNR: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గంగాధర మండలం మధుర నగర్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి స్పందన భారీ లభించింది. సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ రాజు కుమార్ పాల్గొని గ్రామస్థులకు వైద్య సేవలపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో వైద్యులు పలువురికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 10, 2026 / 08:56 PM IST

‘బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి’

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026′ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో శిక్షణ తరగతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

March 10, 2026 / 08:56 PM IST

‘ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని 6వ వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి మాట్లాడారు. పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు.

March 10, 2026 / 08:56 PM IST

రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకున్న స్థానికులు

BHPL: రేగొండ మండలం చెన్నపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు. గతంలో అభ్యంతరాలతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభించగా, గ్రామానికి రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ పనులు ఆపేశారు. దీంతో SI దివ్య సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలకు సర్ది చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 10, 2026 / 08:51 PM IST

మారకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

JN: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తరిగొప్పుల మండలంలోని మరియాపూర్, సోలిపురం, పోతారం గ్రామాల్లో మాదకద్రవ్యాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్మెట్ట సీఐ తరిగొప్పుల ఎస్సై, పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ, మెడికల్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.

March 10, 2026 / 08:46 PM IST

విషాదం.. బోనాల పండుగలో అగ్నిప్రమాదం

WGL: ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. గోవిందు తండాలో తండావాసులు బోనాల పండుగ జరుపుకుంటుండగా మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 10, 2026 / 08:45 PM IST

ఐస్క్రీం తయారీ కేంద్రంపై దాడులు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్‌పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్‌ను సీజ్ చేసి లైసెన్స్ పొందాలన్నారు.

March 10, 2026 / 08:44 PM IST

యజ్ఞ వరాహ స్వామి క్షేత్రంలో జయత్యుత్సవం

కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని యజ్ఞ వరాహ స్వామి క్షేత్రంలో యజ్ఞ వరాహ నిర్మాత భాష్యం విజయ సారథి జయంత్యుత్సవం సందర్భంగా అభిషేకం, వేద పారాయణము, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 12 నుంచి ప్రతి గురువారం 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపారు.

March 10, 2026 / 08:41 PM IST

‘బస్టాండ్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలి’

KNR: ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని బస్ స్టేషన్లు, డిపోలలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని జోన్ ఈడీ పగిడిమర్రి సోలమన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వేసవి దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

March 10, 2026 / 08:37 PM IST