MDK: మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నా ఒక ఇన్నోవా కారు మాసాయిపేట బంగారమ్మ దేవాలయం సమీపంలో అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ఇద్దరికీ గాయాలయ్యాయి.