నిజామాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.పేద ముస్లింలు పండగను సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
HNK: స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వేరోస్ మాజీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. సమాజంలో మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
NLG: నార్కట్‌పల్లి బైపాస్, ఫ్లైఓవర్‌పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఫోటోలు కనిపిస్తున్న వారు మృతి చెందిన బస్సు డ్రైవర్లు. అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదం వివాదాన్ని నివారించేందుకు వాహనాలను పక్కకు నిలిపి డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యలు మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం వేగంగా వీరిని ఢీకొట్టింది.
SRPT: హుజూర్‌నగర్‌లో రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ తేజస్ తెలిపారు. మంగళవారం కాలనీ పనులను పరిశీలించిన ఆయన, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికే ఇళ్లు అందేలా జాబితాను పకడ్బందీగా రూపొందించాలనీ అన్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
PDPL: కాల్వ శ్రీరాంపూర్ KGBV పాఠశాలను కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించారు. విద్యార్థులకు పొందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.
KMR: బాన్సువాడ మండలం కొత్తబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా జరుగుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీవో ఆనంద్ పరిశీలించారు. ఆయన కూలీలతో మాట్లాడి, పని సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
PDPL: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు నూతన ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సేవను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బస్సు కాల్వ శ్రీరాంపూర్ నుంచి ఓదెల, సుల్తానాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
MDCL: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అనురాధ, పీ.సత్యం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వారు గుర్తుచేశారు.
MDK: చిన్నశంకరంపేటలోని ఎస్టీ హాస్టల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించినట్లు ఎంపీడీవో దామోదర్ తెలిపారు. హాస్టల్ బోరు మోటరు చెడిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మోటరును మరమ్మతులకు పంపామని, త్వరలోనే దానిని పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు.
ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామస్థులకు రహదారి సమస్యను తలెత్తుతోంది. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు గుంతలమయంగా ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గుంతలమయంగా ఉన్న రహదారి తమకు ఆటంకంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
MDK: చేగుంట మండలం కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ కృష్ణారావు మంగళవారం సందర్శించారు. తరగతి గది బోధనను పరిశీలించి, కృత్యాల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ మూడో వార్డు సరస్వతి నగర్ కాలానికి వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైనేజ్ స్లాబ్ కొన్ని నెలల క్రితం కూలిపోయి ప్రమాదకరంగా మారింది. గుంత వల్ల పాదాచారులు, వాహనదారులకు ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. స్లాబ్ నిర్మాణానికి ఇసుక కంకర తెచ్చి అలాగే వదిలేశారని కాలనీవాసులు తెలిపారు.
PDPL: రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రూ.75 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ గ్రామాలను క్లస్టర్‌గా విభజించినట్లు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ దంత వైద్యుల దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మొట్టమొదటి దంత వైద్యుడు డాక్టర్ అనిల్ గుప్తాను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ వీరన్న నాయక్ కేక్ కట్ చేసి సభ్యులకు అందజేశారు. డాక్టర్ లెనిన్ చంద్ర, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.