• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో 9 మంది ఎస్సైలు బదిలీ

BHPL: జిల్లాలో మంగళవారం ఒకే సారి 9 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. మొగుళ్లపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, కొత్తపల్లి, భూపాలపల్లి వీఆర్, ములుగు వీఆర్‌లోని స్టేషన్‌లలో బదిలీ కాగా, ఆ స్థానాల్లో నూతన ఎస్సైలు నియమించబడ్డారు. ఈ మార్పులు స్థానిక పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా నియమించడానికి చేపట్టినట్లు అధికారులు తెలపారు.

March 10, 2026 / 03:25 PM IST

రాష్ట్ర సభను విజయవంతం చేయాలి: హంసరెడ్డి

HNK: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం MCPI(U) జిల్లా కార్యదర్శి హంసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ MLA, MCPI(U) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ ఓంకార్ శతజయంతి ఉత్సవాల గోడపత్రులను ఆవిష్కరించారు. ఈనెల 17న HYDలో ‘చట్టసభల్లో ఓంకార్ గారి పాత్ర’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సభ నిర్వహించనున్నారు. MCPI (U) నేతలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.

March 10, 2026 / 03:22 PM IST

నూతన PHC భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి మండలం గట్టు ఇప్పలపల్లిలో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 10, 2026 / 03:21 PM IST

గర్ల్స్ హాస్టల్లో దంత వైద్య శిబిరం

VKB: వికారాబాద్ కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో RBSK ఆధ్వర్యంలో విద్యార్థినులకు దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26 మంది విద్యార్థినులకు దంత సమస్యలు గుర్తించి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వ హాస్టల్స్ సిబ్బంది వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమాణ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ దేవి ఉన్నారు.

March 10, 2026 / 03:20 PM IST

గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు నిప్పు

NRPT: ధన్వాడ మండలం రామకృష్ణయ్య పల్లి గ్రామంలో మంగళవారం డంపింగ్ యార్డ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. ట్రాక్టర్ ముందు టైర్లు పూర్తిగా కాలిపోయాయి. నిప్పంటించిన దుండగులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరారు.

March 10, 2026 / 03:20 PM IST

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

KMM: ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘నవ శకం’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పరీక్ష సామాగ్రి వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. నవ శకం సంస్థ ఫౌండర్ రమేష్‌ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

March 10, 2026 / 03:14 PM IST

వేసవిలో ఆరోగ్యంపట్ల జాగ్రత వహించాలి: ఎమ్మెల్యే

ADB: ఇంద్రవెల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్యులు ఉచిత వైద్యం అందించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

March 10, 2026 / 03:11 PM IST

‘కాళేశ్వరం కాల్వ పనులు పూర్తి చేయాలి’

BHNG: పెండింగ్‌లో ఉన్న కాళేశ్వరం కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి గొలుసు కట్టు చెరువులు నింపాలని రాజాపేట‌ మాజీ సర్పంచ్ వంచ వీరారెడ్డి మంగళవారం ప్ర‌భుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. కాళేశ్వరం 15 ప్యాకేజీలో భాగంగా బేగంపేట, చల్లూరు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం భూమిని సేకరించినప్పటికీ కాల్వ పనులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తెలిపారు.

March 10, 2026 / 03:10 PM IST

‘తుమ్మడిహెట్టి బ్యారేజ్‌కు నిధులు కేటాయించాలి’

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి బడ్జెట్‌లో రెండు సంవత్సరాల్లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, మేడిగడ్డను పునరుద్ధరించాలని కూడా అన్నారు. తుమ్మడిహెట్టి కాంగ్రెస్ పార్టీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.

March 10, 2026 / 03:10 PM IST

జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

MNCL: జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. నెన్నెల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కుందారం ప్రసాద్‌ను తాండూరు, CCRB రామగుండం నుంచి కె.మహేందరన్‌ను నెన్నెలకు బదిలీ చేశారు. భీమిని ఎస్సై విజయ్ కుమార్‌ను రామగుండంకు, ములుగు జిల్లా నుంచి కోటేశ్వర్ భీమిని పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఇవాళ ఉత్తర్వులు విడుదల చేశారు.

March 10, 2026 / 03:10 PM IST

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభం

JGL: గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఏఎంసీ ఛైర్మన్ భీమ సంతోష్ ప్రారంభించారు. పాడి రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించి ఆరోగ్యంగా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్, కాంగ్రెస్ నాయకుడు నిశాంత్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు.

March 10, 2026 / 03:09 PM IST

తాళ్లపేట్ చెరువు సొసైటీలో సభ్యత్వం కల్పించాలని వినతి

MNCL: దండేపల్లి మండలంలోని రాజుగూడ గ్రామపంచాయతీ గిరిజనులు తాళ్లపేట్ చెరువు సొసైటీలో సభ్యత్వం కల్పించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కోరారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే పిఏ శ్రీధర్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్‌కు ఫోన్ చేసి గిరిజనులను సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని ఆదేశించినట్లు వారు తెలిపారు.

March 10, 2026 / 03:08 PM IST

‘మహిళా విద్యా వికాసానికి సావిత్రిబాయి పూలే కృషి’

ASF: కౌటాల మండలంలోని మాలి సంఘం భవనంలో మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యా వికాసానికి ఆమె చేసిన కృషిని నేతలు స్మరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంత్ రావు, నికోడే గంగారం, జిల్లా ఉపాధ్యక్షుడు ఆదే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

March 10, 2026 / 03:07 PM IST

‘ప్రభుత్వం బాధ్యత లేకుండా పాలన సాగిస్తోంది’

BDK: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాసంస్థల్లో కలుషిత ఆహారం కారణంగా ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ విషయంపై మాజీ MLA తాజాగా స్పందించారు. విద్యార్థులు మృతి చెందాడం అత్యంత దారుణమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనలకు కారణమని ఆయన మండిపడ్డారు.

March 10, 2026 / 03:06 PM IST

390 ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు

JGL: పెగడపల్లి మండలంలో 390 ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మండల హౌసింగ్ ఏఈ జ్యోతి పేర్కొన్నారు. మండలానికి 451 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 195 భవనాల నిర్మాణ పనులు స్లాబు లెవల్ వరకు పూర్తయినట్టు తెలిపారు. అలాగే, 59 బేస్‌మెంట్ లెవల్, 51 ఇళ్లు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణం జరిగాయన్నారు. ఇంకా 80 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.

March 10, 2026 / 03:04 PM IST