JGL: పెగడపల్లి మండలంలో 390 ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మండల హౌసింగ్ ఏఈ జ్యోతి పేర్కొన్నారు. మండలానికి 451 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 195 భవనాల నిర్మాణ పనులు స్లాబు లెవల్ వరకు పూర్తయినట్టు తెలిపారు. అలాగే, 59 బేస్మెంట్ లెవల్, 51 ఇళ్లు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణం జరిగాయన్నారు. ఇంకా 80 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.