MNCL: దండేపల్లి మండలంలోని రాజుగూడ గ్రామపంచాయతీ గిరిజనులు తాళ్లపేట్ చెరువు సొసైటీలో సభ్యత్వం కల్పించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కోరారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే పిఏ శ్రీధర్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్‌కు ఫోన్ చేసి గిరిజనులను సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని ఆదేశించినట్లు వారు తెలిపారు.