WG: సీఎం చంద్రబాబు ఈ నెల 9న ప.గో. జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీఎం పర్యటన ఉంటుందని, ఆచంట (మ) సిద్ధాంతం గ్రామసభలో పాల్గొంటారని తెలిపారు