ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన DCCBకి 2025-26లో రూ. 3.58 కోట్లు నికర లాభం ఆర్జించినట్లు ఛైర్మన్ కోన తాతారావు మంగళవారం తెలిపారు. మర్రిపాలెం ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార లావాదేవీలను రూ.3,500 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూ.84 కోట్ల వ్యాపారం చేసిన మాకవరపాలెం సొసైటీ ప్రథమ స్థానంలో ఉందన్నారు.