SKLM: రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని DSP డి. లక్ష్మణరావు అన్నారు. మంగళవారం సాయంత్రం పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయం హెల్మెట్ బ్యాంకును DSP ప్రారంభించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.