MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఆవులను గ్రామస్తులు పట్టుకున్నారు. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనంలో నాలుగు ఆవులు, నాలుగు లేగ దూడలను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పట్టుబడిన వాహనాన్ని, ఆవులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు.