GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి 31న పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రెంటచింతలలో 39 డిగ్రీల గరిష్ఠ, 23 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, నరసరావుపేటలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. తెనాలిలో గరిష్ఠం 37, కనిష్ఠం 23 డిగ్రీలుగా నమోదైంది. బాపట్లలో 34, 24గా నమోదైంది.