MLG: ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్, ఉపాధ్యాయులు పాల్గొని సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి, సమాజంలో సమానత్వానికి ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదని వారు కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.