HNK: శాయంపేట మండలంలోని పశువైద్యశాలలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేసారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ.. ఈ టీకాలు వేయడం ద్వారా పశువులలో రోగనిరోధక శక్తి పెరిగి పశువులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యుత్పత్తి శక్తి పెరిగి రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.