BDK: రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేసిన అవార్డుల్లో సుమారు 20% అవార్డులు భద్రాద్రి జిల్లా టీవీవీపీ ఆసుపత్రులు దక్కించుకున్నాయి. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు గురువారం కలెక్టర్ అంకిత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాటి కలెక్టర్ జితేష్ పాటిల్ నుంచి నేటి కలెక్టర్ అంకిత్ వరకు మద్దతు, సహకారం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సూపరింటెండెంట్లు స్పష్టం చేశారు.